Abn logo
Mar 4 2021 @ 01:25AM

సూర్యనారాయణ సేవలు స్ఫూర్తిదాయకం

కైకలూరు :  పాలచర్ల సూర్యనారాయణ సేవలు స్ఫూర్తిదాయకమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.  కైకలూరులో పంచాయితీరాజ్‌ ఎస్‌ఈగా  పనిచేసి ఇటీవల మృతి చెందిన సూర్య నారాయణ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు.  ఆయన కుమారులు పాలచర్ల సత్యనారాయణచౌదరి, సాగునీటిసంఘాల డీసీ చైర్మన్‌ పాలచర్ల శ్రీనివాస్‌ (ఏఈ శ్రీను)లను ఆయన పరామర్శించి సానుభూతి తెలిపారు. ఎఎంసీ మాజీ చైర్మన్‌ చింతపల్లి వీరరాజరాజేశ్వరి, టీడీపీ నాయకులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి, చింతపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర చేపల రైతుల అసోసేషన్‌ సభ్యులు ముదునూరి సీతారామరాజు, గాదిరాజు భాస్కరరాజు, క్యాషియర్‌రాజు, తదితరులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.


Advertisement
Advertisement
Advertisement