అంబేద్కర్‌ భారీ కాంస్య విగ్రహం తయారు

ABN , First Publish Date - 2021-04-13T05:55:54+05:30 IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ కాంస్య విగ్రహాన్ని తెనాలి సూర్య శిల్పశాలలో రూపొందించారు.

అంబేద్కర్‌ భారీ కాంస్య విగ్రహం తయారు
అంబేద్కర్‌ భారీ కాంస్య విగ్రహంతో శిల్పులు

తెనాలి అర్బన్‌, ఏప్రిల్‌ 12: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ కాంస్య విగ్రహాన్ని తెనాలి సూర్య శిల్పశాలలో రూపొందించారు. పన్నెండున్నర అడుగుల ఎత్తులో విగ్రహాన్ని 1,200 కిలోల కంచు ఉపయోగించి రూపొందించామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో అంబేద్కర్‌ 130వ జయంతి పురస్కరించుకుని ప్రతిష్టించేందుకు గాను ఈ విగ్రహ ఆర్డర్‌ లభించిందన్నారు. 

 

Updated Date - 2021-04-13T05:55:54+05:30 IST