సర్వేలో సీఎంకు మూడో స్థానం బాధాకరం : అయ్యన్న

ABN , First Publish Date - 2020-08-11T14:38:45+05:30 IST

అవినీతి, కరోనా వ్యాప్తి, ఇసుక, భూ కుంభకోణాలు, మహిళలపై..

సర్వేలో సీఎంకు మూడో స్థానం బాధాకరం : అయ్యన్న

నర్సీపట్నం(విశాఖపట్నం): అవినీతి, కరోనా వ్యాప్తి, ఇసుక, భూ కుంభకోణాలు, మహిళలపై దౌర్జాన్యాలు, దళితులపై దాడులు చేయడంలో రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా, ఇండియా టుడే సర్వేలో ముఖ్యమంత్రికి మూడో స్థానం ఇవ్వడం బాధాకరమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం ఓ వీడియో సందేశాన్ని విలేకరులకు విడుదల చేశారు. సర్వేలో సీఎంకు మూడో స్థానం ఇవ్వడం బాధాకరమని, సర్వే తప్పుగా చేసి ఉండాలి లేదా ప్రింటింగ్‌ తప్పు పడి ఉండాలని అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-08-11T14:38:45+05:30 IST