నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటున్న సూర్జేవాలా సాయం

ABN , First Publish Date - 2021-06-14T02:10:18+05:30 IST

హర్యానాకు చెందిన రణ్‌దీప్ సూర్జేవాలా అభిమానులు కొందరు లాక్‌డౌన్ సమయంలో కొవిడ్ నివారణ పరికరాలు అందించడంతో పాటు ఆరోగ్యపరమైన కార్యక్రమాలు చేపట్టారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న

నెటిజెన్ల ప్రశంసలు అందుకుంటున్న సూర్జేవాలా సాయం

న్యూఢిల్లీ: కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా అనేక మంది ఆర్థికంగా ఆరోగ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల సహాయంతో పాటు కొంత మంది వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయి. ప్రముఖంగా సినీ నటుడు సోనూ సూద్ అందిస్తున్న చేయూత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా అతడి బాటలోనే కొంత మంది రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నేతలు కూడా పేదలకు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో జాతీయ కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా అందిస్తున్న సహకారం నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. సూర్జేవాలా లాగే ఇతర నేతలు కూడా ముందుకు రావాలని, ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయాల్లో ఉన్నామన్న నాయకులు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా నిలబడాలని నెటిజెన్లు అంటున్నారు.


హర్యానాకు చెందిన రణ్‌దీప్ సూర్జేవాలా అభిమానులు కొందరు లాక్‌డౌన్ సమయంలో కొవిడ్ నివారణ పరికరాలు అందించడంతో పాటు ఆరోగ్యపరమైన కార్యక్రమాలు చేపట్టారు. హర్యానాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సహాయ కార్యక్రమాల్లో స్వయంగా రణ్‌దీప్ సూర్జేవాలా సైతం పాలు పంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు నెటిజెన్లకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఆక్సీజన్ కొరత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రణ్‌దీప్.. ఆ దిశగానే తన సహాయ కార్యక్రమాలను కేంద్రీకరించారు.


ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా వస్తున్న విజ్ణప్తులకు వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన వారికి సహాయాన్ని అందిస్తున్నారు. వీటితో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి బియ్యం, పప్పులతో పాటు నిత్యవసర సరుకులు అందిస్తున్నారు. అలాగే కొవిడ్‌ను నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్క్‌లు, సానిటైజర్‌లు ఇతర పరికరాలు అందిస్తున్నారు. సూర్జేవాలా నేతృత్వంలో జరుగుతున్న కృషి పట్ల నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







Updated Date - 2021-06-14T02:10:18+05:30 IST