Abn logo
Oct 17 2021 @ 02:36AM

వెటర్నరీ వర్సిటీ డీన్‌గా సర్జన్‌రావు

తిరుపతి(విద్య), అక్టోబరు 16: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ సైన్స్‌ డీన్‌ (ఎఫ్‌ఐసీ)గా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.సర్జన్‌రావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఇంతకుముందు డీన్‌గా ఉన్న డాక్టర్‌ టీఎస్‌ చంద్రశేఖరరావు పదవీకాలం శనివారంతో ముగియడంతో సర్జన్‌రావును నియమించారు. కాగా.. డీఎ్‌సఏగా పనిచేసిన సర్జన్‌రావు జూన్‌ 1నుంచి వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌(డీఆర్‌)గా పనిచేస్తున్నారు. అలాగే సీవోఈగా పనిచేస్తున్న డాక్టర్‌ జేవీ రమణ పదవీకాలం కూడా శనివారంతో ముగిసింది. ఈయన స్థానంలో డెయిరీ టెక్నాలజీ డీన్‌ డాక్టర్‌ జె.సురేశ్‌కు సీవోఈ(ఎ్‌ఫఏసీ)గా బాధ్యతలు అప్పగించగా.. డీఎ్‌సఏ(ఎ్‌ఫఏసీ)గా ఫిషరీడీన్‌ డాక్టర్‌ రవీంద్రకుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ వీసీ ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా వీరిని వర్సిటీలోని అధ్యాపకులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.