తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-27T23:41:03+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సరైన పరిశీలన లేకుండా లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని కోర్టు ప్రశ్నించింది. 2016లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రేషన్ కార్డుల రద్దుకు ఎటువంటి ప్రమాణాలు ఆచరించారో అఫిడవిట్‌ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కంప్యూటర్‌లో పొందుపర్చిన వివరాలతో రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారని సుప్రీంకోర్టు మండిపడింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-04-27T23:41:03+05:30 IST