సమైక్య పాలనలో తెలంగాణ చరిత్ర అణచివేత

ABN , First Publish Date - 2021-08-19T04:23:37+05:30 IST

సమైక్య పాలనలో తెలంగాణ చరిత్రను అణచివేశారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు

సమైక్య పాలనలో తెలంగాణ చరిత్ర అణచివేత
మెదక్‌లో సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణ చేస్తున్నమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

 సర్వాయిపాపన్న విగ్రహావిష్కరణలో  రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఆంధ్రజ్యోతిప్రతినిఽధి, మెదక్‌ , ఆగస్టు 18: సమైక్య పాలనలో తెలంగాణ చరిత్రను అణచివేశారని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు. గొప్పఉద్యమకారుడైన సర్దార్‌ సర్వాయిపాపన్న పేరు కూడా తెలియకుండా చేశారని సమైక్య పాలకులపై ఆయన ధ్వజమెత్తారు. బుధవారం మెదక్‌ శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆవరణలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  గౌడసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో 33 కోటలను జయించి చివరకు గోల్కోండ కోటను కూడా జయించిన గొప్ప వ్యక్తి సర్దార్‌ పాపన్నగౌడ్‌ అని వివరించారు.  కేసీఆర్‌ హయాంలో బహుజనులకు, వారి కులవృత్తులకు గౌరవం దక్కిందని మంత్రి గుర్తు చేశారు. గౌడ కులస్థులే చిట్లు గీయాలి... వాళ్లే కల్లు అమ్మాలని కేసీఆర్‌ జీవో తీసుకురావడం వలన గౌడ కులస్థుల గౌరవం పెరిగిందని మంత్రి గుర్తు చేశారు.


 నెలాఖరులోగా అందుబాటులోకి సింథటిక్‌ ట్రాక్‌

 మెదక్‌ అర్బన్‌, ఆగస్టు18: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సింథటిక్‌ ట్రాక్‌ను ఈ నెలాఖరు వరకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడల, యువజన సర్వీసుల, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తుశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద  సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ చేసి,  ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గౌడ కులస్థులు భారీగా తరలివచ్చారు. మంత్రిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఇందిరా స్టేడియం జరుగుతున్న అవుట్‌ డోర్‌ పనులను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి త్వరగా వాడుకలో వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రూ. 15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అథ్లెటిక్‌ పరికరాలను పరిశీలించారు. సింథటిక్‌ ట్రాక్‌ అందుబాటులోకి వస్తే మెదక్‌ క్రీడల హబ్‌గా నిలుస్తుందన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ స్ధాయి శిక్షణ అందుతుందన్నారు. పట్టణంలో వృత్తినెపుణ్య కేంద్రం ఏర్పాటుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షగౌడ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌,  మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, కౌన్సిలర్లు యశోద, గాయిత్రీ, లక్ష్మి, మమత, ఆర్కెశ్రీను, సమి, రాజు, లక్ష్మీనారాయణగౌడ్‌, పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు కృష్ణగౌడ్‌, మంగ శ్రావణ్‌గౌడ్‌, జనార్ధన్‌గౌడ్‌, ముత్యంగౌడ్‌, రమే్‌షగౌడ్‌, అరవింద్‌గౌడ్‌, సంతో్‌షగౌడ్‌, శంకర్‌గౌడ్‌, అంజనేయులుగౌడ్‌, దామోదర్‌ గౌడ్‌, భూషణంగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు. 


అన్నివర్గాల వారికి ఆదర్శప్రాయుడు సర్దార్‌పాపయ్య

నర్సాపూర్‌, ఆగస్టు 18: సర్దార్‌ పాపయ్య అన్ని వర్గాల వారికి ఆదర్శ ప్రాయుడని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో సర్దార్‌ పాపయ్యగౌడ్‌ 371వ జయంతి సందర్భంగా గౌడ సంఘం ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్థానిక సర్దార్‌పాపయ్యగౌడ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినపుడే  న్యాయం జరుగుతుందని నమ్మి, తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన సర్దార్‌ పాపయ్యగౌడ్‌ నేటి తరాలకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. మహిళాకమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ  సర్ధార్‌పాపయ్యగౌడ్‌ బలహీనవర్గాలకే కాదు అన్ని వర్గాలకు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయాఅశోక్‌గౌడ్‌,  గ్రంథాలయసంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అశోక్‌గౌడ్‌, వాల్దా్‌సమల్లేశ్‌గౌడ్‌, విజయ్‌కుమార్‌తో పాటు నర్సాపూర్‌ నాయకులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-19T04:23:37+05:30 IST