చిన్నమ్మ ఉండాల్సిందే

ABN , First Publish Date - 2021-03-05T11:02:29+05:30 IST

జయలలిత నెచ్చెలి వీకే శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఆమె అభిమానుల్లో ఆందోళన రేపింది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ‘చెంగల్పట్టు శశికళ పేరవై’కు చెందిన కార్యకర్తలతో పాటు వివిధ

చిన్నమ్మ ఉండాల్సిందే

శశికళ ఇంటిముందు మద్దతుదారుల ధర్నా


జయలలిత  నెచ్చెలి వీకే శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఆమె అభిమానుల్లో ఆందోళన రేపింది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ‘చెంగల్పట్టు శశికళ పేరవై’కు చెందిన కార్యకర్తలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆమె ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. కాగా, బీజేపీ ఒత్తిడి వల్లే శశికళ రాజకీయాల నుంచి వైదొలిగారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అయితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని శశికళను ఎవరూ నిర్బంధించలేదని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సీటీ రవి చెప్పారు. 

Updated Date - 2021-03-05T11:02:29+05:30 IST