పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-01T10:37:30+05:30 IST

కాళేశ్వరం రీ డిజైన్‌తో బ్యాక్‌ వాటర్‌ నిలిచిపోయి కోటపల్లి, చెన్నూర్‌, వేమనపల్లి మండలాల పరిధిలో వేల ఎకరాలలో పంటలు నీట

పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌


ఏసీసీ, సెప్టెంబరు 30: కాళేశ్వరం రీ డిజైన్‌తో బ్యాక్‌ వాటర్‌ నిలిచిపోయి కోటపల్లి, చెన్నూర్‌, వేమనపల్లి మండలాల పరిధిలో వేల ఎకరాలలో పంటలు నీట మునిగాయని, బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మంచిర్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయం ఏఓ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్‌ మాట్లాడుతూ గత ఏడాది నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్యాక్‌వాటర్‌ పెద్ద ఎత్తున నిలిచిపోయి కోటపల్లి, చెన్నూర్‌, వేమనపల్లి మండలాల్లోని వేల  ఎకరాలు పంటలు నీట మునిగాయని అన్నారు. యేటా ఇలానే పంటలు నష్టపోతే రైతులు ఇబ్బందులు పడుతారని చెప్పారు.


అధికారులు ముంపు ప్రాంతాలను గుర్తించి రైతులకు ఎకరాకు రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్‌ చేశారు. ఈ సంవత్సరం నష్టపోయిన పంటకు రైతులకు ఎకరాకు రూ.50 వేలు ్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ గోనె శ్యాంసుందర్‌ రావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపతి మల్లేష్‌, జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాదవరపు రమణారావు, పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, యువమోర్చా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T10:37:30+05:30 IST