Supertech: ట్విన్ టవర్సన్‌ను కూల్చిన చోటే.. మళ్లీ కడతామంటూ ముందుకొచ్చిన సూపర్‌టెక్

ABN , First Publish Date - 2022-09-05T00:33:42+05:30 IST

సూపర్‌టెక్ ట్విన్ టవర్స్.. గత వారం 9 సెకన్లలో కూలిన ఈ టవర్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. నిబంధనలు

Supertech: ట్విన్ టవర్సన్‌ను కూల్చిన చోటే.. మళ్లీ కడతామంటూ ముందుకొచ్చిన సూపర్‌టెక్

న్యూఢిల్లీ: సూపర్‌టెక్ ట్విన్ టవర్స్.. గత వారం 9 సెకన్లలో కూలిన ఈ టవర్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సుప్రీంకోర్టు ఆదేశాలతో గతవారం వీటిని అధికారులు కూల్చివేశారు. ఈ టవర్లను కూల్చివేసిన చోటే మళ్లీ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మిస్తామంటూ సూపర్‌టెక్ (Supertech) మరో సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీ ముందు ఓ ప్రతిపాదన ఉంచనున్నట్టు తెలిపింది. అవసరమైతే ఎమరాల్డ్ కోర్టు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) అంగీకారం కూడా తీసుకుంటామని పేర్కొంది. అయితే, ఎమరాల్డ్ కోర్టు రెసిడెంట్స్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. టవర్లను కూల్చేసిన ప్రాంతంలో మరో హౌసింగ్ టవర్‌ను సూపర్‌టెక్ బిల్డర్లు నిర్మిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. 


గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టు కోసం నోయిడా (Noida) అధికారులు సెక్టార్ 93ఎలో 14 ఎకరాల భూమిని కేటాయించినట్టు సూపర్‌టెక్ చైర్మన్ ఆర్‌కే అరోరా తెలిపారు. అయితే,  ఈ 14 ఎకరాల్లో రెండు ఎకరాల్లో మాత్రమే ట్విన్ టవర్లను నిర్మించినట్టు చెప్పారు. ఇప్పుడు జంట భవనాలను కూల్చేయడంతో మరో రెండు ఎకరాల్లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేశామని, ఆ ప్లాన్‌ను నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీకి సమర్పిస్తామని వివరించారు. ఆ భూమిలో ఆలయాన్ని నిర్మించాలనే రెసిడెంట్స్ ప్రణాళికపై అరోరా మాట్లాడుతూ.. అక్కడేం చేయాలన్నా ఆర్‌డబ్ల్యూఏకు తొలుత అక్కడ భూమి ఉండాలని, ఆ భూమి తమదని  అరోరా తేల్చి చెప్పారు. గత ఆదివారం (ఆగస్టు 28)న ట్విన్ టవర్లను కూల్చివేయడం కారణంగా సూపర్‌టెక్‌కు దాదాపు రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది.   

Updated Date - 2022-09-05T00:33:42+05:30 IST