బుజ్జి గవాస్కర్ చేపలు పట్టేవాళ్ల ఇంట్లో దొరికాడు

ABN , First Publish Date - 2021-07-10T14:31:40+05:30 IST

అది 1971.. వెస్టండీస్ టీమ్‌ను దాని సొంత గడ్డపై...

బుజ్జి గవాస్కర్ చేపలు పట్టేవాళ్ల ఇంట్లో దొరికాడు

న్యూఢిల్లీ: అది 1971.. వెస్టిండీస్ టీమ్‌ను దాని సొంత గడ్డపై భారత్ తొలిసారిగా మట్టికరిపించింది. ఈ సిరీస్‌లో ముంబైకి చెందిన ఒక కుర్రాడు తన ప్రతిభను చాటుతూ, పరుగుల వర్షం కురిపించాడు. అతను మరెవరో కాదు... లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్. ఈరోజు (జూలై 10) సునీల్ గవాస్కర్ పుట్టిన రోజు. నేటితో గవాస్కర్‌కు 72 ఏళ్లు వచ్చాయి. ఐదడుగుల ఐదంగుళాలు ఉండే గవాస్కర్ వెస్టిండీస్తో జరిగిన సిరీస్‌లో నాలుగు టెస్టు మ్యాచులలో ఆడి 774 పరుగులు చేశారు. ఈ రోజుకీ ఇది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రికార్డుగానే నిలిచింది.


బాల్యంతో గవాస్కర్‌కు ఎదురైన ఒక సంఘటన అతని జీవితాన్నే మార్చివేసింది. దీని గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సునీల్ గవాస్కర్ తన ఆటోబయోగ్రఫీ ‘సన్నీడేస్’లో తన వ్యక్తిగత వివరాలు వెల్లడించారు.... తాను పుట్టినప్పుడు వారు (ఆ తరువాత అంకుల్ అని పిలిచేవాడిని) ఆసుపత్రికి నన్ను చూసేందుకు వచ్చారు. అప్పుడు ఆయన నా చెవి దగ్గరున్న పుట్టుమచ్చను గమనించారు. మర్నాడు మళ్లీ ఆయన ఆసుపత్రికి వచ్చి, ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా ఆ శిశువు చెవిపై పుట్టుమచ్చలేదు. ఈ విషయం తెలియగానే అంకుల్ ఆసుపత్రిలోని శిశువులందరినీ పరిశీలించారు. చివరికి నన్ను చేపలు పట్టే వారి ఇంట్లో ఒక మహిళ పక్కన పడుకున్న స్థితిలో గుర్తించారు. ఆసుపత్రిలోని నర్సు నాకు స్నానం చేయించిన అనంతరం నన్ను ఆ మత్స్యకారులకు అప్పగించేసింది. ఆరోజు అంకుల్ నన్ను గుర్తించపోతే తాను ఈరోజు చేపలు పడుతూ ఉండేవాడినని తెలిపారు. కాగా సునీల్ గవాస్కర్ తన 16 ఏళ్ల(1971-1987) కెరియర్‌లో తాను ఆడిన టెస్టు మ్యాచ్‌లలో 34 సెంచరీలతో కలుపుకొని మొత్తం 10,122 పరుగులు చేశారు.

Updated Date - 2021-07-10T14:31:40+05:30 IST