స్వయంభువుడిని తాకిన సూర్యకిరణాలు

ABN , First Publish Date - 2021-10-19T06:03:24+05:30 IST

మండలకేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయంలోని శివాలింగాన్ని సోమవారం ఉదయం 7:38గంటలకు సూర్యకిరణాలు తాకాయి.

స్వయంభువుడిని తాకిన సూర్యకిరణాలు
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

మేళ్లచెర్వు: మండలకేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయంలోని శివాలింగాన్ని సోమవారం ఉదయం 7:38గంటలకు సూర్యకిరణాలు తాకాయి. నెలలో ఒక రోజు శివలింగాన్ని సూర్యకిరణాలు తాకుతాయి. కానీ, స్వామివారికి సోమవారం సూర్యకిరణాలు తాకడం విశేషమని వేదపండితులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో  పలు అర్చనలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం రకరకాల పూలతో సుందరంగా అలంకరించారు. 


Updated Date - 2021-10-19T06:03:24+05:30 IST