వేసవి స్విమ్మింగ్‌ శిక్షణా శిబిరం ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-23T06:25:23+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, మే 22: కాకినాడ వివేకానంద పార్కు ఆవరణలోని కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వేసవి స్విమ్మింగ్‌ శిక్షణా శిబిరాన్ని ఆదివారం పూల్‌ నిర్వాహకులు మణికుమార్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జూన్‌ 15 వరకు శిబిరం జరుగుతుందని, రోజూ ఉదయం

వేసవి స్విమ్మింగ్‌ శిక్షణా శిబిరం ప్రారంభం

కాకినాడ స్పోర్ట్స్‌, మే 22: కాకినాడ వివేకానంద పార్కు ఆవరణలోని కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వేసవి స్విమ్మింగ్‌ శిక్షణా శిబిరాన్ని ఆదివారం పూల్‌ నిర్వాహకులు మణికుమార్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జూన్‌ 15 వరకు శిబిరం జరుగుతుందని, రోజూ ఉదయం 5 నుంచి 8 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. నూడిల్స్‌, కిక్‌ప్యాడ్స్‌, పుల్‌బోయ్స్‌, లైఫ్‌గార్డ్స్‌ పరికరాలు సహాయంతో నాలుగేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు శిక్షణ అందిస్తామని తెలిపారు. ఫ్రీస్టైల్‌, బటర్‌ఫ్లై, బ్రస్ట్‌స్ర్టోక్‌, బ్యాక్‌వర్డ్‌, ఫార్‌వార్డ్‌ టెక్నిక్స్‌ను కోచ్‌లు లైఫ్‌గార్డుల పర్యవేక్షణలో నేర్పిస్తారన్నారు. ఆసక్తిగల వారు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌ జిరాక్స్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పూల్‌ ప్రాంగణంలో సంప్రదించాలన్నారు. వివరాలకు 9154495494,9948657999కు ఫోన్‌ చేయాలన్నారు.

Updated Date - 2022-05-23T06:25:23+05:30 IST