లాక్‌డౌన్‌కు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-04-02T09:44:58+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రక్రియకు ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగా రావు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

లాక్‌డౌన్‌కు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం

కరోనా సోకే కేంద్రాలుగా రేషన్‌ డిపోలు

మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు


బొబ్బిలి, విజయనగరం టౌన్‌, ఏప్రిల్‌ 1: లాక్‌డౌన్‌ ప్రక్రియకు ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగా రావు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రం లో ఒక్కసారిగా కరోనా బాధితులు పెరుగు తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజలంతా ఇంటికే పరి మితమై లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరిం చాలని కోరారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ప్రభుత్వం సకాలంలో గుర్తించలేకపోయిందని, వలంటీర్లతో సర్వే సక్రమంగా సాగడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.


రేషన్‌ డిపోలు కరోనా సోకించే కేంద్రాలుగా మారాయన్నారు. రేషన్‌ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయకుండా మంత్రులు కుంటిసాకులు చెబుతున్నారని తెలిపారు. సంచుల ద్వారా పంపిణీ చేస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని చెబుతున్న మంత్రులు రేషన్‌ డిపోల ముందు కార్డుదారులు గుంపులుగా సంచరిస్తే కరోనా వ్యాప్తి చెందబోదని చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. భౌతిక దూరం పాటించాలని, అందరూ ఇళ్లకే పరిమితం కావాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తుంటే ప్రభుత్వం మాత్రం అం దుకు విరుద్ధంగా బాధ్యతారహితంగా వ్యవ హరిస్తోందని విమర్శించారు. ఇలాం టి విపత్కార సమయంలో ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం తీసుకోక పోవడం సరికాదన్నారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఇది సమయం కాదని సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు.

Updated Date - 2020-04-02T09:44:58+05:30 IST