Abn logo
Jul 25 2021 @ 22:37PM

బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు సిగ్గుచేటు

మాట్లాడుతున్న బంగారు శ్రుతి

- బీజేపీ  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి

పెద్దమందడి, జూలై 25: బంగారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగా రు శ్రుతి విమర్శించారు. మండలంలోని మనిగిళ్ల గ్రామంలో ఆదివారం బీజేపీ జెండా ఆవిష్కరణ కా ర్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యో గులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నా రు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూ డు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె అన్నా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధ్ద న్‌ రెడ్డి, బీజీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్విని నం దకుమార్‌, మండల అధ్యక్షుడు రమేష్‌, అశ్వత్థామ రెడ్డి, చెన్నయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.