సాయినాథ్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
భైంసా రూరల్, మే 26 : మండలంలోని కామోల్ గ్రామం లో గురువారం అప్పులబాధతో ఆర్.సాయినాథ్(50) అనే వ్యక్తి తన ఇంట్లోని దూలానికి ఉరి వే సుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం సాయినాథ్ గత సంవత్స రం తన ఇద్దరమ్మాయిల పెళ్లి చే యడంతో అప్పు చేసిన డబ్బులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమ యంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.