Abn logo
Oct 22 2021 @ 00:54AM

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

మృతిచెందిన కరుణాకర్‌ బాబు

అనంతపురం క్రైం, అక్టోబరు 21: నగరంలోని సోమనాథనగర్‌కు చెందిన కరుణాకర్‌బాబు (46) ఆర్థిక ఇబ్బందులు భరించలేక గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కరుణాకర్‌బాబుకు భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇతడు పలు రకాల వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో వ్యాపా ర నిమిత్తం అప్పులు చేశాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందిన అతడు గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటికి ఉరికి వేలాడుతూ కనిపించిన తండ్రిని చూసి, పిల్లలు కేకలు వేశారు. స్థానికుల సమాచారంతో త్రీటౌన పోలీసులు అక్కడికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కరుణాకర్‌ బాబు మృతిపై పలు అనుమానాలున్నట్లు తెలుస్తోంది.