ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-20T07:45:15+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మ హత్య చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడి ఆత్మహత్య

రామన్నపేట, అక్టోబరు 19: ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మ హత్య చేసుకున్నాడు. స్వర్ణకార సంఘం నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటకు చెందిన స్వర్ణకారుడు అక్కినపల్లి భిక్షపతి(68) పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది సోమవారం యాసిడ్‌ తాగి స్పృహతప్పి పడిపోయాడు. ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో  అక్కడి నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భిక్షపతికి భార్య, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భిక్షపతి కుటుంబాన్ని ఆదుకోవా లని స్వర్ణసంఘం నాయకులు కోరారు


Updated Date - 2021-10-20T07:45:15+05:30 IST