Abn logo
Oct 20 2021 @ 01:39AM

చెరువులో పడి వృద్ధుడి ఆత్మహత్య

ధర్మవరం, అక్టోబ రు 19: పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన వృద్ధుడు వజ్జె వెంకటేశ్‌ (68) మంగళవారం  ధ ర్మవరం చెరువులోకి దూ కి ఆత్మహత్య చేసుకు న్నాడు. సీఐ కరుణాకర్‌ తెలిపిన వివరాల మేర కు...పట్టణంలోని మారు తీనగర్‌కు చెందిన వెంకటేశ్‌ గత కొంతకాలంగా బీపీ, షుగ ర్‌తోపాటు కీళ్లనొప్పులతో బాధపడుతుండేవాడు. నొప్పులు భరించలేక తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్తున్నానని ఇంటి లో చెప్పి చెరువు వద్దకు వచ్చి చెరువులోకిదూకి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. చెరువులో శవం తేలాడుతుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందిం చారు. పోలీసులు చెరువు దగ్గరకు చేరుకుని శవాన్ని బయ టకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ఆస్ప త్రికి తరలించారు. మృతునికి భార్య వరలక్ష్మీ, కుమారులు చంద్ర శేఖర్‌, మల్లికార్జునలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.