సబ్సిడీ ఎరువులను ముందే తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-06-01T10:18:03+05:30 IST

వర్షాకాలంలో వేసే పంటలకు రైతులు సబ్సిడీ ఎరువులను ముందే తీసుకోవాలని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌

సబ్సిడీ ఎరువులను ముందే తీసుకోవాలి

జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌


మహబూబ్‌నగర్‌ రూరల్‌, మే 31: వర్షాకాలంలో వేసే పంటలకు  రైతులు సబ్సిడీ ఎరువులను ముందే తీసుకోవాలని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌ తెలిపారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని సింగిల్‌ విండోలలో విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు.


ప్రభుత్వం సూచనల మేరకు రైతులు పంటలు వేయాలన్నారు. జిల్లాలోని 314 గ్రామాల్లో 65 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.119 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఈ నెల 8 వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ వానాకాలంలో కంది, పత్తి, ఆముదం, వరి, జొన్న 3.51 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమావేశంలో మహబూబ్‌నగర్‌ రూరల్‌ రైతుబంధు సమితి అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, హన్వాడ అధ్యక్షుడు రాజుయాదవ్‌, అర్బన్‌ మండల అధ్యక్షుడు రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:18:03+05:30 IST