Abn logo
Mar 29 2021 @ 20:19PM

‘మాజీ ఎమ్మెల్యే అని లెటర్ ప్యాడ్ సిద్ధం చేసుకోండి’ : మమతకు సుబేందు కౌంటర్

కోల్‌కతా : నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి సీఎం మమతకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘మాజీ ఎమ్మెల్యే’ అని లెటర్ ప్యాడ్‌లను సిద్ధం చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. మమత వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. సీఎం మమత భాష ఏమాత్రం బాగోలేదని, ఆమె వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వనని అన్నారు. నందిగ్రామ్‌లో మమత ఎలాంటి ప్రభావం చూపరని, ఆమెకు నందిగ్రామ్ ప్రజలు సరైన జవాబు ఇచ్చి తీరుతారని ప్రకటించారు. నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత తిరిగి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. బెంగాల్ పోలీసులు రాజకీయంగా మమత ఇంకా బతికే ఉన్నారన్న భ్రమల్లో మునిగి తేలుతున్నారని విమర్శించారు. బెంగాల్‌లో జరుగుతున్న వ్యవహారంపై ఈసీ మౌనంగా ఉందని సుబేందు మండిపడ్డారు. మమత గాల్లో వస్తుంది, గాల్లో పోతుందని సుబేందు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమత సుబేందుపై విరుచుకుపడ్డారు. నందిగ్రామ్‌లో ఆయన ఓడిపోతారని అన్నారు. అటు టీఎంసీకి రాలేక, బీజేపీలో ఉండలేని పరిస్థితులు తలెత్తుతాయని, ఎటూ కాకుండా పోతారని మమత సుబేందును ఎద్దేవా చేశారు.