సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే

ABN , First Publish Date - 2021-05-18T04:53:27+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాల సర్వే పక్కాగా చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే అన్నారు.

సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే
టెక్కలి: మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనంజయ్‌ గనోరే


టెక్కలి, మే 17: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో జ్వరాల సర్వే పక్కాగా చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే అన్నారు. సోమవారం టెక్కలిలో మండలస్థాయి అధికారులతో  సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలున్న వారిని తక్షణం గుర్తించి వారి నుంచి నమూ నాలు సేకరించాలని సూచించారు. పాజిటివ్‌ సోకితే ఇంటి వద్ద ఐసోలేషన్‌ సౌకర్యాలు లేనివారు సంతబొమ్మాళిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉండవచ్చన్నారు. ఈ కేంద్రంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈ దిశగా వారికి అవగాహన కలిగించాలన్నారు. సర్వే లైన్స్‌ అధికారుల బృందం, క్షేత్ర స్థాయి సిబ్బంది తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. జ్వర పీడితులకు హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు సరఫరా చే యాలని, ఎక్కడా తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ప్రభు త్వం సూచించిన విధంగా జాబితాలో ఉన్న వారికి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకర్‌, తహసీల్దార్‌ శిర్ల గణపతిరావు, ఎంపీడీవో నారాయణ మూర్తి,  డాక్టర్‌ అంజలి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T04:53:27+05:30 IST