పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌

ABN , First Publish Date - 2021-04-13T06:20:55+05:30 IST

పదో తరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి జిల్లా కామన్‌ పరీక్షల మండలి (డీసీఈబీ) ముద్రించిన స్టడీ మెటీరియల్‌ను జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా సోమవారం కలెక్ట రేట్‌లో విడుదల చేశారు.

పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌
స్టడీ మెటీరియల్‌ విడుదల చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 12 : పదో తరగతి విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు  సన్నద్ధం చేయడానికి జిల్లా కామన్‌ పరీక్షల మండలి (డీసీఈబీ) ముద్రించిన స్టడీ మెటీరియల్‌ను జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా సోమవారం కలెక్ట రేట్‌లో విడుదల చేశారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది పరీక్షలు 11 ప్రశ్నా పత్రా లకు బదులుగా ఏడు ప్రశ్నాపత్రాలతోనే నిర్వహిస్తున్నారని, దానికనుగుణంగానే స్టడీ మెటీరియల్‌ రూపొందించడం జరిగిందన్నారు. సబ్జెక్టు నిపుణులు రూపొం దించిన మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. డీఈవో సీవీ.రేణుక మాట్లాడుతూ పది విద్యార్థుల కోసం ఈనెల 15 నుంచి, మే 5 లేదా 8 నుంచి రెండు దఫాలు మోడల్‌ పరీక్షలు నిర్వ హించనున్నామని వెల్లడించారు. స్టడీ మెటీరియల్‌, మోడల్‌ పరీక్షలు అనుసరించిన  విద్యార్థులంతా పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని వివరించారు. డీసీఈబీ కార్యదర్శి వి.మురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మొత్తం 30 వేల కాపీల ను ముద్రించామని, విద్యార్థులకు, ప్రైవేటు విద్యా సంస్థలకు ఒక్కొ కాపీ రూ. వంద చొప్పున విక్రయిస్తామన్నారు. డీవైఈవో డి.ఉదయకుమార్‌, ఎస్‌.నరసింహమూర్తి, డీసీఈబీ వైస్‌ చైర్మన్‌ డి.సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:20:55+05:30 IST