విద్యార్థులు క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-19T05:52:46+05:30 IST

విద్యార్థులు ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

విద్యార్థులు క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాస్కెట్‌బాల్‌ ఆడుతున్న అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

 అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మే 18: విద్యార్థులు ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఆయన బుధవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన సందర్భంలో అందించేందుకు వైద్య సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. 25 క్రీడాంశాల్లో శిక్షణను ఉచితంగా అందిస్తున్న నగరపాలక సంస్థను అభినందించారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ ఆడారు.   కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి కీర్తి రాజవీరు, మున్సిపల్‌ ఏఈ గంగాధర్‌, క్రీడాశాఖ కోచ్‌లు వి కిష్టయ్య, గణేశ్‌, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘ కార్యదర్శి కడారి రవి, ఫుట్‌బాల్‌ సంఘ కార్యదర్శి ఎండీ వలీపాష, చదరంగ సంఘ అధ్యక్షుడు ఎం అంజయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:52:46+05:30 IST