Abn logo
Jul 27 2021 @ 22:46PM

ర్యాగింగ్‌ భూతానికి విద్యార్థులు దూరంగా ఉండాలి

మాట్లాడుతున్న పాపిరెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

సంగారెడ్డి క్రైం, జూలై 27 : విద్యార్థినీ, విద్యార్థులు ర్యాగింగ్‌ భూతానికి దూరంగా ఉండాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో వర్చువల్‌ పద్ధతిన మంగళవారం ర్యాగింగ్‌ నిషేధం చట్టం గురించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌ చేయడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్‌ పాడైపోతుందన్నారు. అంతేగాక విద్యార్థులు మానసికంగా, భౌతికంగా కృంగిపోతారని, ర్యాగింగ్‌ చేసిన వారు, చేయడానికి ప్రోత్సహించిన వారు శిక్షార్హులని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్‌.ఆశాలత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌, మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు.