క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T03:53:39+05:30 IST

విద్యార్థుల్లో క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 19: విద్యార్థుల్లో క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌ పోటీ లను అదనపుకలెక్టర్‌ రాజేశం, ఎమ్మెల్యే ఆత్రంసక్కుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యార్థులకు ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలిసితీసి వారు క్రీడల్లో రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపా ధ్యాయులపై ఉందన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శని వారం రంగోలిపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఈవోఅశోక్‌, జడ్పీటీసీ అరిగెలనాగేశ్వర్‌రావు, తదిత రులు పాల్గొన్నారు.

వీరుల త్యాగాలను స్మరించుకోవాలి..

వీరుల త్యాగాలను స్మరించుకునే గొప్ప సమయం వచ్చిందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జైలులో ఖైదీలకు, జిల్లా ఆస్పత్రిలో రోగులకు అదనపుకలెక్టర్‌ రాజేశం, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి జైల్లో, ఆస్పత్రిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితం గా స్వాతంత్రం వచ్చిందని అటువంటి వారి త్యాగా లను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ స్వామి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T03:53:39+05:30 IST