విద్యార్థుల కోసం ‘నాన్‌ ముదల్వన్‌’

ABN , First Publish Date - 2022-03-02T14:08:44+05:30 IST

రాష్ట్రంలో పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను పెంపొందించే దిశగా ‘నాన్‌ ముదల్వన్‌’ (నేనే ప్రథముడిని) అనే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం కింద యేటా పది లక్షలమంది

విద్యార్థుల కోసం ‘నాన్‌ ముదల్వన్‌’

                           - పథకం ప్రారంభించిన Stalin


చెన్నై: రాష్ట్రంలో పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను పెంపొందించే దిశగా ‘నాన్‌ ముదల్వన్‌’ (నేనే ప్రథముడిని) అనే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం కింద యేటా పది లక్షలమంది విద్యార్థులను చదువుతో పాటు ప్రతిభా పాటవాలను పెంపొందించనుంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఇమిడి ఉన్న ప్రత్యేక ప్రతిభాపాటవా లను గుర్తించి ఆ దిశగా వారిని నిష్ణాతులుగా చేసేందుకు ఈ పథకం దోహదం చేయనుంది. చేపాక్‌ కలైవానర్‌ అరంగం లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తెలుసుకునేందుకు రూపొందించిన ప్రత్యేక మార్గనిర్దేశిత పుస్తకాన్ని ఆయన ఆవిష్క రించారు. తొలి ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు స్వీకరించారు. ఈ పథకానికి సంబందించి naanmudhalvan. tnschools. gov.in  అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులందరికీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ ఉద్యోగాల వివరాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగా వకాశాలకు సంబంధించిన వివరాలను ఎప్పటి కప్పుడు తెలియజేస్తారని చెప్పారు. ఈ పథకం తన స్వీయ పర్యవేక్షణలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

Updated Date - 2022-03-02T14:08:44+05:30 IST