విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2020-11-25T05:43:28+05:30 IST

విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అన్నారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
విద్యార్థులకు సర్టిఫికేట్లను అందిస్తున్న డీఈవో

 డీఈవో రాధాకిషన్‌ 

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, నవంబరు 24: విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాలల కళోత్సవా లు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ 64 కళల్లో ఏ రంగాన్ని అయినా ఎంచుకుని ఆ రంగంలో ముందుండాలన్నారు. జిల్లాలోని పాఠశాల స్థాయి నుం చి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విజేతలకు మెమోంటోలు, సర్టిఫికేట్లను అందజేశారు. శా స్త్రీయ సంగీత గానంలో అఖిల (కేజీబీవీ గంభీరావుపేట), జానపద నృత్యంలో ఐశ్వర్య (కేజీబీవీ వేములవాడ), జానపద గానంలో రా యల సుప్రియ (కేజీబీవీ తంగళ్లపల్లి), హస్తకళలు జే అర్చన (కేజీబీవీ మర్రిపల్లి, వేములవాడ), చిత్రలేఖనంలో ఎన్‌ అక్షయ (వెంకంపేట), ఎం ఆకాష్‌ (కోనరావుపేట) ఎంపికయ్యారు. కార్యక్ర మంలో జిల్లా సెక్టోరల్‌ అధికారి రాంచందర్‌రావు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం అధికారి వీఎం శ్రీనివాస్‌, జిల్లా సమన్వయ కర్త గోనే బాల్‌రెడ్డి, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం బొగ్గారపు శంకర్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-25T05:43:28+05:30 IST