పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2021-07-25T05:46:46+05:30 IST

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని హెచ్‌పీపీఎల్‌ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రతన్‌రాజ్‌ అన్నారు. శనివారం ఏయూ కెమికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగంలో హెచ్‌పీపీఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటుచేసిన ప్రాసెస్‌ మోడలింగ్‌ అండ్‌ సిమ్యులేషన్‌ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి
ప్రయోగశాలను ప్రారంభిస్తున్న రతన్‌రాజ్‌

 ఏయూ క్యాంపస్‌, జూలై 24: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని హెచ్‌పీపీఎల్‌ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రతన్‌రాజ్‌ అన్నారు. శనివారం ఏయూ కెమికల్‌ ఇంజ నీరింగ్‌ విభాగంలో హెచ్‌పీపీఎల్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటుచేసిన ప్రాసెస్‌ మోడలింగ్‌ అండ్‌ సిమ్యులేషన్‌ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తం గా అన్ని పరిశ్రమల్లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌తో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, తర్ఫీదు అందించడం దీనివల్ల సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, రెక్టార్‌ సమత, ప్రొఫెసర్లు పి.కింగ్‌, ఎస్‌వీ నాయుడు, వెంకటసుబ్బయ్య, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:46:46+05:30 IST