117 మంది విద్యార్థుల వద్ద విచారణ

ABN , First Publish Date - 2021-12-29T14:51:01+05:30 IST

మద్రాసు విశ్వవిద్యాలయంలో దూరవిద్యకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా జరిపిన పరీక్షలలో చోటుచేసుకున్న అవకతవకలపై 117 మంది విద్యార్థుల వద్ద విచారణ జరుపుతున్నట్టు వైస్‌చాన్సలర్‌ ఎస్‌.గౌరి తెలిపారు. 1980వ

117 మంది విద్యార్థుల వద్ద విచారణ

                     - మద్రాసు వర్సిటీ పరీక్షల్లో అవకతవకల వ్యవహారం


చెన్నై: మద్రాసు విశ్వవిద్యాలయంలో దూరవిద్యకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా జరిపిన పరీక్షలలో చోటుచేసుకున్న అవకతవకలపై 117 మంది విద్యార్థుల వద్ద విచారణ జరుపుతున్నట్టు వైస్‌చాన్సలర్‌ ఎస్‌.గౌరి తెలిపారు. 1980వ సంవత్సరానికి సంబంధించి కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం నిర్వహించిన పరీక్షల్లో 117 మంది విద్యార్థులు అక్రమంగా పాల్గొన్నట్టు తేలిన విషయం తెలిసిందే. వీరంతా కోర్సుకు దరఖాస్తు చేసుకోకుండానే ఏకంగా పరీక్షకు హాజరయ్యారు. అయితే వారిపేర్లు రికార్డుల్లోనే లేకపోవడంతో అసలు గుట్టు రట్టయింది. వారు అక్రమ మార్గంలో ఫీజులు కట్టి పరీక్షలకు హాజరైనట్టు తేలింది. ఈ వ్యవహారంపై ఆ విశ్వవిద్యాలయం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, వైస్‌ఛాన్సలర్‌ విచారణను ప్రారంభించారు. ఆ మేరకు ఏయే పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు జరిగాయనే విషయంపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై మద్రాసు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ గౌరి మాట్లాడుతూ.. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు విశ్వవిద్యాలయం సిండికేట్‌ సభ్యులు కలిగిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్ట్లు ప్రకటించారు. ఆ కమిటీలో మూడు లేదా ఐదుగురు సభ్యులు వుంటారని చెప్పారు.

Updated Date - 2021-12-29T14:51:01+05:30 IST