సర్కారు బడికే మొగ్గు

ABN , First Publish Date - 2020-10-29T06:21:04+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గతం ఏడాది కంటే ఈ యేడు బాగా పెరుగుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశా లల్లో చదివే విద్యార్థులు అధికసంఖ్యలో సర్కార్‌ పాఠశాలల్లో చేరుతున్నారు

సర్కారు బడికే మొగ్గు

ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు 

జిల్లాలో 1152 మంది చేరిక

అత్యధికంగా కోయిలకొండ, అత్యల్పంగా దేవరకద్ర మండలాల్లో..  

ఒకటవ తరగతిలో 3140 మంది

విద్యార్థులు అడ్మిషన్‌


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, అక్టోబరు 28:  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గతం ఏడాది కంటే ఈ యేడు  బాగా పెరుగుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశా లల్లో చదివే విద్యార్థులు అధికసంఖ్యలో సర్కార్‌ పాఠశాలల్లో చేరుతున్నారు. కొవిడ్‌-19 విజృంభనతో ఇప్పటి వరకు పాఠశాలు తెరుచుకోలేదు. ఈ నేపథ్యం లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభు త్వం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఈ  తరగ తులు ప్రభుత్వ పాఠశాలల్లో  కొనసాగుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూ లు చేస్తుడడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభు త్వ పాఠశాల్లో చేర్పించేందుకు సిద్ధపడుతున్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండ డంతో   తల్లిదండ్రులు ఈ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే  జిల్లాలో పలు ప్రైవేట్‌ పాఠ శాలల నుంచి 1152మంది చేరినట్లు అంచనా. అదే విధంగా ఒకటో తరగతిలో  ఇప్పటి వరకు 3140మంది విద్యార్థులు చేరారు. 


 జిల్లాలో మొత్తం 880 ప్రభుత్వ పాఠశాలు ..

జిల్లాలో మొత్తం 880 ప్రభుత్వ పాఠశాలలు ఉ న్నాయి. కరోనా వైరస్‌ విజృంభన కారణంగా గత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే బడులు బంద్‌ అయ్యాయి. దానితో  విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండగా నేటికీ బడులు తెరుకొని పరిస్థితి.  అయితే వి ద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపి  ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించింది. టీ శాట్‌, డీడీ , దూరదర్శన్‌ చానల్స్‌ ద్వారా, స్మాట్‌ ఫోన్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తున్నారు.  వీటిని విద్యార్థులు సు లువు గా అర్థం  చేసుకుంటున్నారు. విద్యార్థులు కూ డా ప్రైవేట్‌ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశా లల్లో చేరేందుకు మక్కువ చూపుతున్నారు.


నిరంతర పర్యవేక్షణ

ప్రభుత్వ పాఠశాలలో గత నెల 1నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైయ్యాయి. 50శాతం మంది ఉ పాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్నారు. విద్యార్థులు పాఠాలు ఏలా వింటున్నారనే విషయాలను ఇళ్లకు వెళ్లి పర్యవేక్షిస్తుండడంతో అర్థం కాని విషయాలను విద్యా ర్థులు అడిగి తెలుసుకుంటున్నారు. మరో 50శాతం మంది టీచర్లు విద్యార్థులకు ఫోన్‌ చేసి ఏ పాఠం వి న్నారు, అర్థమయిందా.. అంటూ ఒకటికి రెండు మార్లు  అడిగి తెలుసుకుంటున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశా లలో విద్యార్థుల సంఖ్య పెరగటానికి దోహదపడు తుం ది.  అంతే కాకుండా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులు  ఇతర అధికారులతో కలిపి ఐదు కమిటీలను వేశారు. వారంతా కూడా పర్యవేక్షిస్తుండ డంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.  

Updated Date - 2020-10-29T06:21:04+05:30 IST