Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 09 Aug 2022 13:53:24 IST

`నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను..` అంటూ లేఖ రాసిన ఓ యువకుడు ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే..

twitter-iconwatsapp-iconfb-icon
`నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను..` అంటూ లేఖ రాసిన ఓ యువకుడు ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే..

ప్రేమలో మోసపోయానని భావించిన ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు ఆ యువకుడు తన ప్రియురాలు, తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ 4 పేజీల సూసైడ్ నోట్ (suicide note) కూడా రాశాడు. తన ప్రియురాలు తనను మోసం చేసినట్టు, ఆమె కోసం తల్లిదండ్రులను, కుటుంబాన్ని విడిచిపెట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌ (Rajastan)లోని దుంగార్‌పూర్ జిల్లా మాడ గ్రామంలో జరిగింది. మాడ గ్రామానికి చెందిన రణ్‌వీర్ బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదీన ఘోరాఘాట్‌లో నివాసం ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లాడు.


ఇది కూడా చదవండి..

Viral News: అతని వయసు 75.. ఆమెకు 70.. పెళ్లైన 54 ఏళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధ జంట..!

అక్కడ ఉన్న రెండు రోజులు రణ్‌వీర్ నిరంతరం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ గడిపాడు. ఆదివారం ఉదయం దుంగార్‌పూర్‌కు వెళ్లి మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసే సరికి కనిపించలేదు. మధ్యాహ్నం వరకు రణ్‌వీర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని అక్క, బావ కంగారు పడ్డారు. అతడి కోసం వెతికారు. చివరకు పొలాల మధ్యలో ఉన్న ఓ చెట్టుకు రణ్‌వీర్ ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


`మిస్ రాజ్.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నేను పోయిన తర్వాత అయినా నువ్వు సంతోషంగా ఉండు. అసలు నాతో ఎందుకు ఆడుకున్నావు? నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నాకు చేసిన వాగ్ధాలన్నింటినీ నువ్వు మర్చిపోయావు. ఎందుకు నాకు అన్ని ఆశలు కల్పించావు. అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పావు. ఇప్పుడు నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నాను. ఇకపై నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావో వారితో జీవించవచ్చు. నా మృతదేహాన్ని చూడాలనుకుంటే కచ్చితంగా చూడు. అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతున్నాన`ని రణ్‌వీర్ ఆ లేఖలో రాశాడు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.