క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాకు మించిన ట్విస్టులు.. 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఫోన్లో దొరికిన ఒక్క క్లూతో స్పెషల్ ఆపరేషన్..

ABN , First Publish Date - 2022-06-25T20:44:49+05:30 IST

ఆ 13 ఏళ్ల బాలిక చిప్స్ కొనుక్కుంటానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఎంత సేపటికీ తిరిగి రాలేదు..

క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాకు మించిన ట్విస్టులు.. 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. ఫోన్లో దొరికిన ఒక్క క్లూతో స్పెషల్ ఆపరేషన్..

ఆ 13 ఏళ్ల బాలిక చిప్స్ కొనుక్కుంటానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఎంత సేపటికీ తిరిగి రాలేదు.. తల్లిదండ్రులు ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.. తమ కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.. ఫోన్లో దొరికిన క్లూను ఉపయోగించి ఎన్నో మార్గాల ద్వారా సమాచారం సేకరించి ఆ బాలికను, ఓ యువకుడిని బీహార్‌లో పట్టుకున్నారు..


ఇది కూడా చదవండి..

కాబోయే అత్త ప్రవర్తన నచ్చలేదట.. ప్రేమించిన వాడితో పెళ్లిని రద్దు చేసుకున్న యువతి కథ ఇదీ..!


రాజస్థాన్‌లోని దర్బంగాకు చెందిన 13 ఏళ్ల బాలిక తరచుగా ఆన్‌లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ ఆడుతుండేది. ఆ క్రమంలో ఆ బాలికకు ఖతార్‌లో పనిచేస్తున్న నేపాల్ వ్యక్తి ఇజ్రాయేల్ పరిచయమయ్యాడు. ఆ బాలికను మాయ మాటలతో నమ్మించి ఆకట్టుకున్నాడు. అనంతరం బాలిక కోసం ఖతార్ నుంచి దర్బంగా వచ్చాడు. ఆ బాలికను కలుసుకుని ఆమె బ్రెయిన్ వాష్ చేసి ఢిల్లీ తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లాక తన సిమ్ నెంబర్ మార్చేశాడు. ఢిల్లీ నుంచి ఆ బాలికను తీసుకుని బీహార్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేపాల్ వెళ్లిపోవాలనేది అతడి ప్లాన్. అయితే బీహార్‌లో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. 


అదృశ్యమయ్యే రోజు ఆ బాలిక తన మొబైల్‌లో ఛాట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీపై పోలీసులు నిఘా పెట్టారు. ఆ ఐడీకి అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేశారు.  ఢిల్లీ-బీహార్ మధ్య ఉన్న రైల్వే రూట్‌లో ఆ నెంబర్ యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఓ పోలీసు బృందం దర్బంగా నుంచి ఢిల్లీకి బయల్దేరింది. మొబైల్ లొకేషన్ ఆధారంగా ఇద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-25T20:44:49+05:30 IST