Advertisement
Advertisement
Abn logo
Advertisement

లక్షకు చేరువలో విద్యార్థుల హాజరు

కరోనా పరిస్థితులను అధిగమిస్తున్నాం : డీఈవో అశోక్‌


నడిగూడెం, నవంబరు 30 : కరోనా పరిస్థితులను అధిగమించి జిల్లాలో లక్ష మందికి చేరువలో విద్యార్థులు హాజరు అవుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ తెలిపారు. నడిగూడెం బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 998 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో లక్షా 10వేలకు పైగా విద్యార్థులు ఉన్నారన్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశా లు, విద్యార్థుల హాజరు శాతంపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ లక్ష మంది విద్యార్థులు హాజరయ్యేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రస్తుం 80 వేలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకునే క్రమం లో భాగంగా తరగతి గదులు, రికార్డులు, ప్రార్థన, మధ్యాహ్న భోజనం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించామన్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించి, జిల్లాలోని ఎంఈవోలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కొన్నిచోట్ల నియోజకవర్గం మొత్తానికే ఒక్కరే ఎంఈవో ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. స్కూ ల్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో హిందీ తరగతి బోధన తీరును పరిశీలించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు శోభన్‌బాబు, ఉపాధ్యాయులు ఉన్నారు. 

Advertisement
Advertisement