బాలికల విద్యా, సాధికారత కోసం పోరాటం

ABN , First Publish Date - 2021-03-08T05:46:10+05:30 IST

ఎస్‌ఎఫ్‌ఐ 50ఏళ్ల నుంచి బాలికల విద్యా సాధికారత కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు సురేఖ అన్నారు.

బాలికల విద్యా, సాధికారత  కోసం పోరాటం
మాట్లాడుతున్న సురేఖ

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి7: ఎస్‌ఎఫ్‌ఐ 50ఏళ్ల నుంచి బాలికల విద్యా సాధికారత కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు సురేఖ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సురేఖ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలాన్ని గుర్తించి సమాజంలో మహిళల చైతన్యం కోసం కృషి చేస్తుందన్నారు. ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు లావణ్య, జిల్లా అధ్యక్షుడు తోటకపిల్‌ ఉన్నారు.

Updated Date - 2021-03-08T05:46:10+05:30 IST