ఇంటర్‌ పరీక్షల నిర్వణకు పటిష్ఠ చర్యలు

ABN , First Publish Date - 2021-10-21T06:47:10+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుం చి నిర్వహించే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను పటిష్ఠంగా నిర్వహి ం చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని డీఐఈఓ దస్రూ నాయక్‌ ఆదేశించా రు.

ఇంటర్‌ పరీక్షల నిర్వణకు పటిష్ఠ చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఐఈఓ దస్రూనాయక్‌

 నూతనంగా వచ్చిన యాప్‌లో వివరాల నమోదు 

 మాల్‌ ప్రాక్టీస్‌ జరిగితే సీఎ్‌సలదే బాధ్యత    

నల్లగొండ క్రైం, అక్టోబరు 20: జిల్లావ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుం చి నిర్వహించే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను పటిష్ఠంగా నిర్వహి ం చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని డీఐఈఓ దస్రూ నాయక్‌ ఆదేశించా రు. స్థానిక లెక్చరర్స్‌ భవన్‌లో బుధవారం చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణకోసం 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, నూతనంగా ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులను నియమించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సూచనలు చేసినట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని, ప్రతిరోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయడంతోపాటు ప్రతిఒక్కరూ విధిగా మాస్కులను ధరించి హాజరు కావాలన్నారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేందిలేదన్నారు. విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి రాగానే ఓఎంఆర్‌పై అవగాహ న కల్పించాలని, సీఎస్‌ నుంచి ప్రతిఒక్కరూ విధిగా గుర్తింపుకార్డులను ధరించాలన్నారు. ప్రస్తుతం ఇంటర్‌ బోర్డు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన యాప్‌లో పరీక్ష ముగిసేలోగా విద్యార్థుల హాజరు, బ్లాంక్‌ ఓఎంఆర్‌, మాల్‌ ప్రాక్టీస్‌, ఇతర వివరాలను డీఓ, సీఎ్‌సలు సమన్వయంతో తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. యాప్‌పై ఎలాంటి సందేహాలు ఉన్నా జిల్లా పరీక్ష ల కమిటీతో సంప్రందించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎక్కడైనా మాల్‌ ప్రాక్టీస్‌ జరిగితే సీఎ్‌సలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రం పరిధిలోని జీరాక్స్‌ సెంటర్లను మూసివేయాలన్నారు. సమావేశంలో భానునాయక్‌, నరేందర్‌కుమార్‌, ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T06:47:10+05:30 IST