నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-07T04:33:40+05:30 IST

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి ఖాదర్‌ హుస్సేన్‌ అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
దహెగాంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఈవో

ఆసిఫాబాద్‌, మే 6: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి ఖాదర్‌ హుస్సేన్‌ అన్నారు. గురువారం మండలంలోని గుండెన్‌ఘాట్‌, చిర్రకుంట గ్రామాల్లో నకిలీ విత్తనా లపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నం చేస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. విత్తన డీలర్లు విధిగా ప్రతిరైతుకు రశీదు ఇవ్వాలన్నారు.

దహెగాంలో..

దహెగాం: మండలంలోని లగ్గాం గ్రామంలో ఏఈవో శోభన్‌ గురువారం నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదులు తీసుకోవా లన్నారు.


Updated Date - 2021-05-07T04:33:40+05:30 IST