అక్రమంగా విద్యుత్‌ వాడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-01-22T04:52:22+05:30 IST

అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఈపీడీసీఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.సతీష్‌కుమార్‌ హెచ్చరించారు.

అక్రమంగా విద్యుత్‌ వాడితే   కఠిన చర్యలు
మాట్లాడుతున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌

 రామభద్రపురం: అక్రమంగా  విద్యుత్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఈపీడీసీఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.సతీష్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో  మాట్లా డుతూ.. అధికంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నట్లు  తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్లు ఇస్తుందన్నారు. కొత్త మీటర్లకు దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోవాలని కోరారు.   గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.   విద్యుత్‌ సమస్యలపై ఏర్పాటుచేసిన 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌ను వినియోగించు కోవాలని సూచించారు.  బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలో 50 వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే  మంజూరు చేస్తామని చెప్పారు. సోంపురం రక్షిత నీటి పథకానికి  ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తా మన్నారు. రొంపల్లి, శిష్టు సీతారాంపురం, కోటశిర్లాం గ్రామాల్లో  కొత్త స్తంభాలు వేస్తామన్నారు. ఈ సమావేశంలో విద్యుత్‌ శాఖ ఏఈ సాంబశివరావు ఉన్నారు. 

 

Updated Date - 2022-01-22T04:52:22+05:30 IST