కరోనా కట్టడికి కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-10-20T06:48:41+05:30 IST

ఆరోగ్య శ్రీ పథకం కింద నమోదైన ఆసుపత్రులు నిబంధనల మేరకు వైద్యం అందిస్తున్నది లేనిది పరిశీలనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకట

కరోనా కట్టడికి కఠిన చర్యలు

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

ఏలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఆరోగ్య శ్రీ పథకం కింద నమోదైన ఆసుపత్రులు నిబంధనల మేరకు వైద్యం అందిస్తున్నది లేనిది పరిశీలనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకట రమణా రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘా ల్‌, కమిషనర్‌ కె.భాస్కర్‌ అన్ని జిల్లాల జేసీలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫ రెన్సు నిర్వహించారు. కొవిడ్‌ - 19, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ, సీజనల్‌ వ్యాధులు, వైద్య సిబ్బంది నియామకం, తదితర అంశా లపై సమీక్షించారు.


జేసీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ‘జిల్లాలో ఇప్పటి వరకూ 5,59,067 శాంపిల్స్‌ సేకరించి, 5,56,287 ఫలితాలను ప్రకటిం చాం. వీరిలో 81,649 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, సోమవారానికి 6,239 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడికి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద ఈ ఏడాది నుంచి జిల్లాలో 2,059 జబ్బులకు చికిత్స అందిచాం. ఈ పథకంలో వైద్యం చేసే 116 ఆసుపత్రులను జిల్లాలో  గుర్తించాం.


గత ఆర్థిక సంవత్సరంలో ఆపరేషన్స్‌, చికిత్సలు పొందిన 58,460 మందికి 140.49 కోట్లు, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ 15 వరకు ఆపరేషన్స్‌, చికిత్సలు పొందిన 29,946 మందికి రూ.55.96 కోట్లు బిల్లులు చెల్లించాం. వివిధ కేటగిరిల కింద ప్రభుత్వాసుపత్రిల్లో భర్తీ చేయాల్సిన మిగిలిన 78 పోస్టులను బుధవారం నాటికి పూర్తి చేస్తామన్నారు. మలే రియా, డెంగ్యూ, డయేరియా వంటి సీజనల్‌ వ్యాధులను అరి కట్టేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు.


వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రోజు తప్పనిసరిగా ఏడు వేల టెస్ట్‌లు నిర్వహించేలా చూడా లన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కేసుల నమోదు ఎక్కు వగా ఉందని, వీటి కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదే శించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ఎస్‌.తేజ్‌భరత్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.సునంద, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌  తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-10-20T06:48:41+05:30 IST