అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

ABN , First Publish Date - 2020-07-10T10:51:23+05:30 IST

అభివృద్ధి పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ భారతి హోళికేరి హెచ్చరించారు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్‌ ఆగ్రహం 


తాండూర్‌(బెల్లంపల్లి), జూలై 9 : అభివృద్ధి పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ భారతి హోళికేరి హెచ్చరించారు. గురువారం తాండూర్‌ ఎంపీడీవో కార్యాల యంలో సర్పంచులు, కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో  సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఇంకుడుగుంత లు, మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డు పనుల వివరాలను తెలుసుకున్నారు. ఎంత మందికి ఉపాధి కల్పించా రని, వంద రోజుల పనిని ఎక్కువ మంది కూలీలకు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా గ్రామా ల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వీటిపై సర్పంచులు, కార్యదర్శులు దృష్టి సారించడం లేదని కలెక్టర్‌ అసహనం వ్యక్తంచేశారు. నెలాఖరు వరకు వంద శాతం పనులు పూర్తికాకపోతే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుధ్యం, హరితహా రం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల ప్రత్యేక నిధులు కేటాయి స్తోందని, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల నిర్మాణంలో నిర్ల క్ష్యంగా వ్యవహరించవద్దని, ప్రభుత్వ స్థలం లేకపోతే దాతల ను సంప్రదించాలని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. మహిళా సర్పంచుల బంధువులు, భర్తలు పెత్తనం చేయడం, సమావేశాలకు హాజరవుతే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌ చట్టంపై కార్యదర్శులు, సర్పం చులకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, డీఆర్‌డీవో శేషాద్రి, డీఎల్‌పీవో ఫణీంద్ర, తహసీల్దార్‌ కవిత, ఎంపీడీవో శశికళ, ఎంపీపీ ప్రణయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:51:23+05:30 IST