మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-01-19T05:25:39+05:30 IST

పో లీసు స్టేషన్ల పరిధిలో మోసాలకు పాల్పడేవారిపై విచార ణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 19 ఫిర్యాదులు స్వీకరించా రు. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఎయిడెడ్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షల 50 వే

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు




విజయనగరం క్రైం, జనవరి 19: జిల్లాలోని పో లీసు స్టేషన్ల పరిధిలో  మోసాలకు పాల్పడేవారిపై విచార ణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 19 ఫిర్యాదులు స్వీకరించా రు.  విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఎయిడెడ్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.  9 లక్షల 50 వేలు తీసుకుని మోసం చేశాడని  గంట్యాడ మండలం చినమా నాపురానికి చెందిన బాధితుడు తెలిపాడు. డబ్బులు ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుతున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరాడు. తమ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు బెదిరిస్తున్నారని  బొండపల్లి మండలం నెలివా డకి చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడ్డారని నెల్లిమర్ల మండలం జర్జాపుపేటకి చెందిన  వ్యక్తి తెలిపాడు.  పై సమస్యలపై విచారణ చేపట్టి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని  ఎస్పీ  పోలీసు అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-01-19T05:25:39+05:30 IST