ఏయూలో ఎస్‌టీపీఐ ఇంక్యుబేషన్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-01-29T05:35:59+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి కేంద్ర ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహణలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ఆసక్తి చూపింది.

ఏయూలో ఎస్‌టీపీఐ ఇంక్యుబేషన్‌ సెంటర్‌
ఇంక్యుబేషన్‌ సెంటర్‌ పత్రాన్ని వీసీకి అందిస్తున్న రామ్‌ప్రసాద్‌

తొలి దశలో రూ.19.75 కోట్లతో నిర్మాణం: వీసీ 

ఏయూ క్యాంపస్‌, జనవరి 28: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి కేంద్ర ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహణలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ఆసక్తి చూపింది.  ఈ మేరకు శుక్రవారం ఎస్‌టీపీఐ డైరెక్టర్‌, సైంటిస్ట్‌ జీసీవీడీ రామ్‌ప్రసాద్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందం వీసీ ప్రసాద్‌రెడ్డితో భేటీ అయ్యారు. తొలిదశలో రూ.19.75 కోట్లు వెచ్చించి 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫెసిలిటీస్‌తో కూడిన ఎస్‌టీపీఐ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను  ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను వీసీకి అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌టీపీఐ సీనియర్‌ ఏవో రవిశంకర్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ మల్లేశ్వరరావు, రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:35:59+05:30 IST