వందేళ్లకు పైబడిన వృక్షం ఇది. ఎన్నో పక్షులకు ఆవాసమై, బాటసారులకు నీడనిచ్చింది. అయితే ఈ వేసవిని ఎదుర్కొనలేక ఇలా నిలువునా ఎండిపోయింది. నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఎండిపోయి ఉన్న చెట్టు ప్రస్తుతం కూలడానికి సిద్ధమై ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఆందోళన కల్గిస్తోంది. అధికారులు తక్షణం దీనిని తొలగించాలని నూజివీడు పట్టణ వాసులు కోరుతున్నారు.
–నూజివీడు టౌన్