పాము - కాకి

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

ఒక చిన్నరాజ్యం పక్కన ఉన్న చిట్టడవిలో మర్రిచెట్టు మీద రెండు కాకులు నివాసం ఉండేవి. అవి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ చెట్టు కిందే ఉన్న పుట్టలో ఒక పాము ఉండేది...

పాము - కాకి

ఒక చిన్నరాజ్యం పక్కన ఉన్న చిట్టడవిలో మర్రిచెట్టు మీద రెండు కాకులు నివాసం ఉండేవి. అవి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ చెట్టు కిందే ఉన్న పుట్టలో ఒక పాము ఉండేది. రోజూ కాకులు ఆహారం కోసం బయటకు వెళ్లేవి. ఆ సమయంలో పాము కాకులు పెట్టిన గుడ్లను తినేసేది. కాకులకు ఏం చేయాలో పాలు పోలేదు. దాంతో నక్క దగ్గరకు వెళ్లి సహాయం కోరాయి. అప్పుడు వాటికి నక్క ఒక ఉపాయం చెప్పింది. మరుసటి రోజు ఒక కాకి రాజ భవనానికి వెళ్లి రాణిగారి హారాన్ని ఎత్తుకొచ్చింది.  ఆభరణాన్ని ఎత్తుకెళ్లడం చూసి రాజభటులు కాకిని వెంబడించారు. భటులు చూస్తుండగా కాకి ఆ ఆభరణాన్ని పాము పుట్టలో జారవిడిచింది. దాంతో భటులు పుట్టను తవ్వారు. పుట్టలో నుంచి బయటకు వచ్చిన పామును చంపి ఆభరణాన్ని తీసుకెళ్లారు. పాము బెడద తప్పడంతో ఆ కాకులు సంతోషంగా జీవించాయి.

Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST