రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-07-29T02:57:21+05:30 IST

కర్నూలు: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో జరుగుతుంటాయి. కొన్నిసమయాల్లో తెల్లవారుజామున కూడా జరుగుతుంటాయి. ఈ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో డ్రైవర్లు వేగాన్ని పెంచేస్తారు. మితిమీరిన వేగంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ప్రమాదాలు జరగడానికి మరో కారణం నిద్రమత్తు. కంటి నిండా సరిపడ నిద్ర లేకపోవడం వల్ల ముందున్న

రోడ్డు ప్రమాదాల నివారణకు  ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం

కర్నూలు: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో జరుగుతుంటాయి. కొన్నిసమయాల్లో తెల్లవారుజామున కూడా జరుగుతుంటాయి. ఈ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో డ్రైవర్లు వేగాన్ని పెంచేస్తారు. మితిమీరిన వేగంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటారు.  ప్రమాదాలు జరగడానికి మరో కారణం నిద్రమత్తు. కంటి నిండా సరిపడ నిద్ర లేకపోవడం వల్ల ముందున్న వాహనాన్ని ఢీ కొట్టడం లేదా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టునో, విద్యుత్ స్థంబాన్నో ఢీ కొట్టడం చూస్తుంటాం. ఇంకొన్ని రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో జరుగుతుంటాయి. డ్రైవర్లు తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి.


అయితే రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు జిల్లా ఎస్పీ  సిద్దార్థ్ కౌశల్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. తెల్లవారుజామున భారీ వాహనాల డ్రైవర్లకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌  గో’ కార్యక్రమం నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. వాహనాన్ని ఆపి డ్రైవర్ ముఖం కడుక్కోని తిరిగి వాహనం నడపడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇలా చేయడం వల్ల డ్రైవర్లకు నిద్ర మత్తు తొలగిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే వాహనాలలో పరిమితికి మించి విద్యార్థులు, ప్రయాణీకులకు ఎక్కించుకునే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. 

Updated Date - 2022-07-29T02:57:21+05:30 IST