బెంగాల్ అప్‌డేట్ : విధాన్‌ నగర్‌లో ఉద్రికత్త

ABN , First Publish Date - 2021-04-17T17:38:03+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 21.26 శాతంగా పోలింగ్ నమోందైంది

బెంగాల్ అప్‌డేట్ : విధాన్‌ నగర్‌లో ఉద్రికత్త

కోల్‌కతా :  పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 21.26 శాతంగా పోలింగ్ నమోందైంది. ఓటు హక్కును వినియోగించుకోడానికి పోలింగ్ బూత్‌ ముందు ప్రజలు బారులు తీరారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ వేదికగా కోరారు. మొదటి సారి ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ అభ్యర్థించారు. 


విధాన్‌ నగర్‌లో ఉద్రిక్తత


ఐదో దశ పోలింగ్ సందర్భంగా విధాన్‌ నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లను రువ్వుకున్నారు. దీంట్లో పలువురు మహిళలు గాయపడ్డారు. మరోవైపు పోలింగ్ బూత్ నెంబర్ 107 లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ అభిజిత్ సామంత్ అకస్మాత్తుగా మృతి చెందాడు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. 


సీఆర్పీఎఫ్ ఓటింగ్‌ను ప్రభావితం చేస్తోంది : తృణమూల్

అధికార తృణమూల్ మరోసారి కేంద్ర భద్రతా బలగాలపై ఆరోపణలు చేసింది. సీఆర్పీఓఎఫ్ బలగాలు ఓటర్లను ప్రభావితం చేస్తోందని ఇరోపించారు. బీజేపీకి ఓటు వేయాలంటూ పూర్బా వర్ధమాన్‌లో చెబుతున్నారని టీఎంసీ ఆరోపించింది. అంతేకాకుండా ఓ జాబితాను కూడా విడుదల చేసింది.

Updated Date - 2021-04-17T17:38:03+05:30 IST