నాలుగు రోజుల ముందు నుంచే కడుపులో నొప్పి ఉంటుంది. ఎందుకలా?

ABN , First Publish Date - 2022-02-18T17:44:16+05:30 IST

మా పాపకు 16 సంవత్సరాలు. నెలసరి వచ్చే నాలుగు రోజుల ముందు నుండి ఓ వారం రోజుల పాటు కడుపులో నొప్పి అంటుంది. ఏదైనా ప్రత్యేకమైన ఆహారం ద్వారా నొప్పి తగ్గుతుందా?

నాలుగు రోజుల ముందు నుంచే కడుపులో నొప్పి ఉంటుంది. ఎందుకలా?

ఆంధ్రజ్యోతి(18-02-2022)

ప్రశ్న: మా పాపకు 16 సంవత్సరాలు. నెలసరి వచ్చే నాలుగు రోజుల ముందు నుండి ఓ వారం రోజుల పాటు కడుపులో నొప్పి అంటుంది. ఏదైనా ప్రత్యేకమైన ఆహారం ద్వారా నొప్పి తగ్గుతుందా?


- భవాని, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: నెలసరి సమయంలో చాలా మందికి పొత్తి కడుపునొప్పి, నడుమునొప్పి, తలనొప్పి, వికారం, అలసట, డయేరియా, కడుపు ఉబ్బరం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే ఈ లక్షణాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. తలనొప్పి, కడుపు ఉబ్బరం తగ్గించడానికి నీళ్లు అధికంగా తీసుకోవాలి. కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తప్పని సరిగా తాగాలి. పుచ్చ, ఖర్బూజా, కీరా, దానిమ్మ లాంటి పండ్లు తీసుకోవాలి. నెలసరి సమయంలో రక్తం అధికంగా పోవడం వల్ల రక్తహీనత, నీరసం రావచ్చు. రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ ఆకుకూరలు ఏదో ఒక రూపంలో తినాలి. శనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు లాంటి గింజలతో కూరలను తినాలి. ఈ ఆహారంలో ఉండే ఇనుమును మన శరీరం శోషించు కోవడానికి విటమిన్‌- సి అవసరం. దీని కోసం విటమిన్‌ - సి ఉన్న అన్ని రకాల పండ్లు, నిమ్మరసం, పచ్చి క్యాప్సికమ్‌ తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం చికెన్‌, చేప, గుడ్లు, అన్ని రకాల పప్పులు, సోయాగింజలు, సోయా ఉత్పత్తులైన సొయాపనీర్‌, మీల్‌ మేకర్‌ లాంటివి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆహారంలో ఉప్పు, చక్కెర, తీపిపదార్థాలు తగ్గించాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-18T17:44:16+05:30 IST