బ్లాక్ ఫంగస్ గురించి షాకింగ్ నిజాలు!!
ABN , First Publish Date - 2021-05-25T01:38:58+05:30 IST
కరోనా నుంచి కోలుకున్న తరువాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే..
కరోనా నుంచి కోలుకున్న తరువాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల బ్లాక్ ఫంగస్ కేసులు ఆసుపత్రుల్లో ఉన్నాయి. వీరిలో అధికశాతం కరోనా నుంచి కోలుకున్న తర్వాతే బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి కారణం స్టెరాయిడ్ల వినియోగం, అనారోగ్య సమస్యలే కారణమని నిపుణులు చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహాత్మాగాంధీ వైద్య కళాశాలలో మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ వీపీ పాండే 210 మంది బ్లాక్ ఫంగస్ రోగులపై చేసిన అధ్యయనంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఫలితాలొచ్చాయి. బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి స్టెరాయిడ్స్ మాత్రమే కారణం కాదని, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణం కాదని వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 14% మంది స్టెరాయిడ్స్ ఉపయోగించలేదు. 21% మందికి మధుమేహం లేదు. 36% మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. 52% మంది రోగులు మాత్రమే బయటి నుంచి ఆక్సిజన్ తీసుకున్నారు. ప్రధానంగా 100% మంది యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో ఈ ఫంగస్ కనిపించింది. అయితే ఈ అధ్యయనంలో జింక్ వినియోగంపై పరిశోధన చేయలేదు. ఈ విషయాన్ని రాజీవ్ జయదేవన్ అనే వైద్యుడు ట్విటర్‌లో వెల్లడించాడు. దీంతో ఇన్నాళ్లూ అనుకున్నట్లు బ్లాక్ ఫంగస్ ఉధృతికి స్టెరాయిడ్స్, మధుమైహం వంటివి కాదని ఈ అధ్యయయంలో తేలింది.