స్ట్రీట్‌ వెండర్స్‌ జోన్‌ల ఏర్పాటుకు చర్యలు : డీసీ శైలజ

ABN , First Publish Date - 2020-06-06T10:54:08+05:30 IST

జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో స్ట్రీట్‌ వెండర్స్‌ జోన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీ శైలజ అధికారులను ఆదేశించారు. సర్కిల్‌

స్ట్రీట్‌ వెండర్స్‌ జోన్‌ల ఏర్పాటుకు చర్యలు : డీసీ శైలజ

కాప్రా,జూన్‌ 5 (ఆంద్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో స్ట్రీట్‌ వెండర్స్‌ జోన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీ శైలజ అధికారులను ఆదేశించారు. సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం స్ట్రీట్‌ వెండర్స్‌ కమిటీతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకులు సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని డీసీ తెలిపారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌ అధికారి ఇందిర, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ ఖుద్దూస్‌, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 


కుత్బుల్లాపూర్‌, గాజులరామారంలో..

వీధి వ్యాపారుల కామన్‌ ఇన్‌ట్రస్ట్‌ గ్రూప్స్‌ (సీఐజీ)ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్‌, గాజులరామారం డీసీలు ఎం.మంగతాయారు, పి.రవీందర్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో టీవీసీ (స్ట్రీట్‌ వెండింగ్‌ కమిటీ) సభ్యులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర అభియాన్‌లో భాగంగా వీధి వ్యాపారులకు రూ.10 వేలు ఇస్తుందని, అర్హులైన వారిని గుర్తించాలని వారు తెలిపారు. అనంతరం టీవీసీ సభ్యులు, సిబ్బందితో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - 2020-06-06T10:54:08+05:30 IST