పోరాటంతోనే ఉక్కు పరిరక్షణ సాధ్యం

ABN , First Publish Date - 2021-03-05T06:27:44+05:30 IST

ఉక్కు కర్మాగారం కోసం స్వాతంత్య్ర పోరాటం స్థాయిలో పోరు సాగాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చైర్మ న్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు.

పోరాటంతోనే ఉక్కు పరిరక్షణ సాధ్యం
మాట్లాడుతున్న పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌

 పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌   

కూర్మన్నపాలెం, మార్చి 4: ఉక్కు కర్మాగారం కోసం స్వాతంత్య్ర పోరాటం స్థాయిలో పోరు సాగాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చైర్మ న్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెంలో సెంటర్‌ప్లాంట్‌ ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రజా పోరాటాలతోనే ఉక్కు పరిరక్షణ సాధ్యమని, ప్రజల మనోభావాలతో ముడి పడి ఉన్న కర్మాగారాన్ని అమ్మ డం అంత తేలికకాదన్నారు. ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావాన్ని తెలిపారు. దేశం లో 300 పరిశ్రమలను మోదీ విక్రయానికి పెట్టారన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఏ రాజకీయ పార్టీ ప్రయత్నించినా మట్టి కొట్టుకు పోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణరా వు, ఏపీ, తెలంగాణా ఇంటక్‌ ఉపాధ్యక్షులు జెర్రిపోతుల ముత్యాలు, ఉక్కు పరిరక్షణ కాంగ్రెస్‌ కమిటీ చైర్మన్‌ గొంపా గోవింద, అనకాపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, అప్పలనాయుడు, సన్యాసిరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T06:27:44+05:30 IST